
దేశవ్యాప్తంగా సంచలనం రేపిన తిరుమల లడ్డూ (Tirumala Laddu)లో నెయ్యి కల్తీపై సిట్(SIT) దర్యాప్తు మొదలు పెట్టింది. తిరుపతి భూదేవి కాంప్లెక్స్ లో సిట్ అధికారుల తాత్కాలిక ఆఫీసును ప్రభుత్వం ఏర్పాటు చేసింది. తిరుమల, తిరుపతిలో పర్యటించి విచారణ జరపనున్నారు. నెయ్యి సరఫరా చేసిన ఏఆర్ డెయిరీ ఫుడ్స్ తోపాటు.. లడ్డూ తయారు చేసే ప్రాంతం, విక్రయ కేంద్రాలలో సిట్ దర్యాప్తు చేపట్టనుంది. లడ్డూ తయారీలో పాల్గొనే శ్రీవైష్ణవులను కూడా అధికారులు ప్రశ్నించనున్నారని సమాచారం. కాగా తన నివేదికను సీబీఐ డైరెక్టర్ కు సిట్ అందించనుంది.
Editor: Ramesh Rao
All Rights Reserved | 3S News - 2025