సీఎం రేవంత్‌ రెడ్డికి వైఎస్ షర్మిల కీలక విజ్ఞప్తి

Ramesh

Ramesh

District Chief Reporter

తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) అదానీని బ్లాక్ లిస్ట్‌లో పెట్టాలని ఏపీ కాంగ్రెస్‌ పార్టీ చీఫ్‌ వైఎస్‌ షర్మిల(YS Sharmila) సూచించారు. నేడు వైఎస్ షర్మిల హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడారు. ఈ క్రమంలో ఆమె ఒక సహచరిగా రేవంత్‌కు విజ్ఞప్తి చేస్తున్న అదానీతో బిజినెస్ చేయవద్దని అన్నారు. ఈ సందర్భంగా వైఎస్ షర్మిల మాట్లాడుతూ.. అమెరికా గౌతమ్ అదానీపై సంచలన వ్యాఖ్యలు చేశారు. గౌతమ్ అదానీ 2021 ఆగస్టులో అప్పటి ఆంధ్రప్రదేశ్ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని(YS Jagan) కలిశారని యూఎస్ సెక్యూరిటీస్ అండ్ ఎక్స్ఛేంజ్ కమిషన్ సైతం స్పష్టం చేసిందని ఆమె గుర్తు చేశారు. గౌతం అదానీ టీం దేశంలో కొంత మంది సీఎంలకు లంచాలు ఇచ్చినట్లు ఆమె ఆరోపించారు. ఇందులో ఏపీ మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డికి ఇచ్చినట్టు వెల్లడైందని వైఎస్ షర్మిల పేర్కొన్నారు.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు

 నోటిఫికేషన్స్

 Share