
గడిచిన కొంతకాలంగా చాలా మంది సెలబ్రేటీలు తమకు ఉన్న ఫాలోవర్స్(followers) ను చూస్తూ మురిసిపోతు.. రాజకీయాల్లోకి అడుగు పెడుతున్నారు. ఈ క్రమంలో లక్షల మంది ఫాలోవర్స్ ఉన్నప్పటికి ఎన్నికల్లో పోటీ చేసి ఘోరాతి ఘోరమైన పరాజయాన్ని మూట గట్టుకుంటున్నారు. ఈ క్రమంలోనే తాజాగా మహారాష్ట్ర (Maharashtra) అసెంబ్లీకి జరిగిన ఎన్నికల్లో బిగ్ బాస్ మాజీ కంటెస్టెంట్, యాక్టర్ అజాజ్ ఖాన్(Actor Ajaz Khan) ఆజాద్ సమాజ్ పార్టీ(Azad Samaj Party) తరుఫున వెర్సోవాలో పోటీ చేశారు. ఈయనకు ఇన్స్ట్రాగ్రామ్(Instagram)లో ఏకంగా 5.6 మిలియన్స్(56 లక్షల మంది) ఫాలోవర్స్ ఉన్నారు. అయితే మహారాష్ట్ర ఎన్నికల ఫలితాలు వెలువడుతుండటంతో ఆతని ఫలితాలపై సోషల్ మీడియా(Social media) ఆసక్తిగా ఎదురు చూసింది.
ఈ క్రమంలో వెలువడిన ఫలితాలు 56 లక్షల మంది ఫాలోవర్స్ (followers) ఉన్న నటుడితో పాటు అతనికి టికెట్ ఇచ్చిన పార్టీకి, ఆయన ఫాలోవర్స్ కి షాక్ ఇచ్చాయి. ఇప్పటి వరకు మొత్తం 20 రౌండ్ల ఓట్ల లెక్కింపు పూర్తవ్వగా.. ఆయనకు కేవలం 146 ఓట్లు మాత్రమే వచ్చాయి. దీంతో నటుడికి వచ్చిన ఓట్లతో ప్రస్తుతం సోషల్ మీడియా(Social media)లో ట్రోల్ చేస్తున్నారు. సోషల్ మీడియాలో ఫాలోవర్స్ ఉన్నంత మాత్రాన.. రాజకీయాల్లో రాణించలేరని.. దీనికి నటుడు అజాజ్ ఖాన్ నిదర్శనమని కామెంట్లు చేస్తున్నారు. ఏది ఏమైనప్పటికి.. సోషల్ మీడియాలో ఫాలోవర్స్ ఉన్నంత మాత్రాన రాజకీయాల్లో రాణించడం సులభం కాదని.. మరోసారి రుజువైందని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు.
Editor: Ramesh Rao
All Rights Reserved | 3S News - 2025