WhatsAppలో మరో అదిరిపోయే ఫీచర్..!!

Ramesh

Ramesh

District Chief Reporter

ప్రస్తుత రోజుల్లో దాదాపు అందరూ స్మార్ట్ ఫోన్లు(Smart phones) ఉపయోగిస్తున్నారు. స్మార్ట్ మొబైల్ ఉన్న ప్రతి ఒక్కరూ వాట్సాప్ వాడుతున్నారు. ఉదయం గుడ్ మార్నింగ్ మెసేజ్‌ల నుంచి మొదలు ఎన్నో ముచ్చట్లు వాట్సాప్‌లోనే పంచుకుంటున్నారు. అయితే తాజాగా వాట్సాప్‌లోకి మరో సూపర్ ఫీచర్ వచ్చేసింది. వాట్సాప్‌లో వాయిస్ నోట్స్ ను ఈజీగా సెండ్ చేసేస్తారు కదా.. మైక్ బటన్(మైక్ button) ప్రెస్ చేసి.. మీరు ఏదైతే చెప్పాలనుకుంటారో అది చెప్పేస్తారు.

దీంతో ఫింగర్స్‌తో ప్రతి పదం టైప్ చేయాల్సిన అక్కర్లేదు. అయితే ఈ ప్రాసెస్ బాగానే ఉంటుంది. కానీ పలు సందర్భాల్లో వాయిస్ మెసేజ్‌(message)లు వినడం కష్టంగా ఉంటుంది. అంటే ముఖ్యమైన మీటింగ్స్ ఉన్నప్పుడు, సరదాగా ఫ్రెండ్స్‌తో కబుర్లు చెబుతున్నప్పుడు, కలిసి చర్చలు జరుపుతున్నప్పుడు ఇలాంటి వాయిస్ మెసేజ్‌లు వస్తే వాటిని వినడం కాస్త అన్‌కంఫార్ట్‌గా ఉంటుంది.

ఎందుకంటే ఆ వాయిస్‌ మెసేజ్ (Voice message)లో ఏవైనా ఇంపార్టెంట్(Important), సీక్రెట్ విషయాలు ఉన్నట్లైతే.. పక్కన ఉన్నవారు వినే అవకాశం ఉంటుంది. కాగా టెక్ట్స్(texts) రూపంలో పంపితే పక్కన ఎవరున్నా చదవడానికి వీలుంటుంది. ఇందుకోసం వాట్సాప్ ఓ కొత్త ఫీచర్‌‌ను తీసుకొస్తుంది.

ఈ మెసేజింగ్ యాప్‌లో మీకు వచ్చిన ఆడియో సంభాషణను ట్రాన్స్‌క్రైబ్ చేయడానికి దానిపై టైప్ చేసి టెక్ట్స్ మెసేజ్ గా మార్చవచ్చు. ఈ ఫీచర్ మరికొన్ని డేస్‌లో అందుబాటులోకి రానుంది. సాధారణంగా వాట్సాప్ వాయిస్ నోట్ ట్రాన్స్‌క్రిప్షన్‌ను అనుమతించదు. అయితే రానున్న ఈ కొత్త ఫీచర్ వల్ల మీరు ఆటోమెటిక్ గా వాయిస్ మెసేజ్ వచ్చిన చోటే ట్రాన్స్‌క్రిప్ట్‌(Transcript) చేయవచ్చు.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు

 నోటిఫికేషన్స్

 Share