
కేబుల్ టీవీ, సెట్-టాప్ బాక్స్ లతో పనిలేకుండా.. 500 TV ఛానెల్స్, OTT యాప్స్ తో BSNL ఉచిత టీవీ సర్వీస్‌ను ప్రారంభించింది. ప్రభుత్వ రంగ సంస్థ అయిన భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ (BSNL-బీఎస్ఎన్ఎల్) యూజర్లకు శుభవార్త అందించింది. ఈ ఫ్రీ సర్వీస్‌లో భాగంగా.. నెట్‌ఫ్లిక్స్(Netflix), యూట్యూబ్(Youtube).. గేమింగ్ ఆప్షన్లతో పాటు డిస్నీ+ హాట్‌స్టార్(Disney+ Hotstar), అమెజాన్ ప్రైమ్ వీడియో(Amazon Prime Video),జీ5 (G5) వంటి ప్రముఖ OTT ప్లాట్‌ఫారమ్‌లు కూడా అందుబాటులో ఉంటాయని BSNL ప్రకటించింది.
రీసెంట్గా బీఎస్ఎన్ఎల్ భారతదేశంలో ఫస్ట్ ఫైబర్ ఆధారిత ఇంటర్నెట్ టీవీ సర్వీసులకు స్టార్ట్ చేసిన విషయం తెలిసిందే. దీన్ని అంతా ఐఎఫ్టీవీ(IFTV) అని అంటారు. ఇది కేవలం ఎంపిక చేసిన ప్రాంతాల్లో మాత్రమే అందుబాటులో ఉంది. మరికొన్ని రోజుల్లో అన్ని ప్రాంతాలకు విస్తరించనున్నట్లు వెల్లడించింది.
ఫైబర్-టు-ది-హోమ్ (FTTH) చందాదారుల కోసం BSNL కొత్త లోగో మరో ఆరు కొత్త సేవలను స్టార్ట్ చేసింది. ఈ కొత్త సేవలతో పాటు IFTVని కూడా ఇంట్రడ్యూస్ చేసింది. ఈ ఐఎఫ్టీవీ సేవలో సుమారు 500 లకు పైగా ఛానెల్స్ చూడవచ్చని అఫిషీయల్‌గా అనౌన్స్ చేసింది బీఎస్ఎన్ఎల్. అలాగే అధికారిక వెబ్ సైట్(Official website) 300 కంటే ఎక్కువ ఛానెల్స్ తమిళనాడు, మధ్యప్రదేశ్ కస్టమర్లకు మాత్రమే వర్తిస్తాయని వెల్లడించింది.
Editor: Ramesh Rao
All Rights Reserved | 3S News - 2025