
ఏపీ కూటమి నేతలకు ప్రధాని మోదీ కీలక సందేశం ఇచ్చారు. ఏపీలో జరిగిన మూడు ఎమ్మెల్సీ ఎన్నికల్లో రెండు కూటమి అభ్యర్ధులు గెలుచుకున్నారు. ఒక ఉపాధ్యాయ స్థానం నుంచి పీఆర్టీయూ అభ్యర్ధి గెలుపు పొందారు. ఉభయ గోదావరి తో పాటుగా క్రిష్ణా – గుంటూరు జిల్లాల పట్టభద్రుల నియోజకవర్గాల ఎమ్మెల్సీ అభ్యర్ధులుగా గెలిచిన కూటమి అభ్యర్ధులను ప్రధాని మోదీ అభినందిం చారు. అదే సమయంలో భవిష్యత్ నిర్దేశించారు. చంద్రబాబు స్పందించి ధన్యవాదాలు చెప్పారు.
ఏపీలో జరిగిన మూడు ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూటమి రెండు స్థానాల్లో గెలుపు సాధించింది. రెండు పట్టభద్రుల నియోజకవర్గాల్లో కూటమి అభ్యర్ధులు గెలవటం పైన ప్రధాని స్పందించారు. ఏపీలో రెండు కూటమి గెలవగా.. తెలంగాణలో రెండు స్థానాలు బీజేపీ గెలుచుకుంది. ఈ రెండు తెలుగు రాష్ట్రాల్లో ఫలితాల పైన స్పందించిన ప్రధాని మోదీ తన ఎక్స్ ఖాతా ద్వారా అభినందనలు తెలిపారు…” విజయం సాధించిన ఎన్డీయే అభ్యర్థులకు అభినందనలు. కేంద్రంలోను మరియు ఆంధ్రప్రదేశ్‌లోని ఎన్‌డిఎ ప్రభుత్వాలు ప్రజలకు సేవ చేస్తూనే ఉంటాయి మరియు రాష్ట్రం యొక్క అభివృద్ధి ప్రయాణాన్ని కొత్త శిఖరాలకు తీసుకెళ్తాయి..” అని పేర్కొన్నారు.