ఛాంపియన్స్‌ ట్రోఫీలో టీమిండియా ఫైనల్‌‌కు దూసుకెళ్లిన సంగతి తెలిసిందే

G Karna Kumar

G Karna Kumar

Chief Editor

ఛాంపియన్స్‌ ట్రోఫీలో టీమిండియా ఫైనల్‌‌కు దూసుకెళ్లిన సంగతి తెలిసిందే. ఆస్ట్రేలియాతో జరిగిన తొలి సెమీ ఫైనల్‌లో టీమిండియా ఘన విజయం సాధించింది. నాలుగు వికెట్ల తేడాతో భారత జట్టు విజయాన్ని అందుకుంది. తద్వారా ఛాంపియన్స్‌ ట్రోఫీ-2025లో ఫైనల్‌కు చేరిన తొలి జట్టుగా టీమిండియా నిలిచింది.ఆస్ట్రేలియా విధించిన 265 పరుగుల లక్ష్యాన్ని భారత జట్టు సునాయాసంగా ఛేదించింది. ఛేజింగ్ మాస్టర్ కింగ్ కోహ్లీ మరోసారి రాణించడంతో ఆస్ట్రేలియాపై టీమిండియా ఘన విజయం సాధించింది. మరో వైపు రెండో ఫైనల్‌లో సౌతాఫ్రికా, న్యూజిలాండ్ జట్లు తలపడగా, కివీస్ జట్టు విజయాన్ని అందుకుని ఫైనల్‌కు చేరుకుంది.

దీంతో ఆదివారం టీమిండియాతో న్యూజిలాండ్ ఫైనల్‌లో తలపడనుంది.ఇదిలా ఉంటే ఫైనల్‌కు ముందు టీమిండియాకు బిగ్ షాక్ తగిలేలా కనిపిస్తోంది. స్టార్ ఆల్‌ రౌండర్ హార్దిక్ పాండ్యాకు గాయం అయినట్టు తెలుస్తోంది. ఆస్ట్రేలియాతో జరిగిన సెమీ ఫైనల్ మ్యాచ్‌లో హార్దిక్ పాండ్యాకు గాయం అయింది. హార్దిక్ పాండ్యా బ్యాటింగ్ చేస్తోన్న సమయంలో కాలుకు గాయం అయింది. హార్దిక్ పరుగు తీయడానికి ప్రయత్నిస్తూ గాయపడ్డాడు. హార్దిక్ వెంటనే తన క్రీజులోకి తిరిగి వచ్చినప్పుడు కాలు ఇబ్బందిపెట్టినట్లు కనిపించింది.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు

 నోటిఫికేషన్స్

 Share