FLASH NEWS

ముళ్ల కట్ట బ్రిడ్జి వద్ద గోదావరిలో వందలాది కోళ్లు

దేశవ్యాప్తంగా బర్డ్ ఫ్లూ సోకడంతో వెయ్యిల కొద్దీ కోల్ మృత్ బాధపడుతున్నాయి దీనితో వ్యాపారస్తులు పెద్ద మొత్తంలో నష్టం వాటిల్లుతుంది చనిపోయిన కోళ్లను ఊరికి దూరాన అడవి ప్రాంతాలలో గోతులు తవ్వి దానిలో కోళ్లను ఖననం చేస్తున్నారు అలాగే దేశవ్యాప్తంగా చికెన్ తినవద్దని ప్రభుత్వం ప్రజలకు హెచ్చరిస్తున్న ప్రజలు పట్టించుకోకపోవడంతో ఇష్టానుసారంగా వ్యాపారస్తులు చనిపోయిన కోళ్లను కూడా అమ్మే పరిస్థితి కనబడుతుంది అలాగే ఈరోజు ములుగు జిల్లాలో ఎటురునాగారం వాజేడు మండలాలకు చెందిన కోళ్ల వ్యాపారులు కోళ్లకు సోకడంతో వందలాది కోళ్లు చనిపోవడం దీనితో వ్యాపారస్తులు పెద్ద ఎత్తున కోళ్లను తెచ్చి దగ్గరలో ఉన్న ముళ్లకట్ట బ్రిడ్జి గోదావరిలో పడేసినట్టు సమాచారం తెలుస్తుంది దీని వలన కోళ్లు గోదావరిలో తేలుకుంటూ నీటిని అపరిశుభ్రం చేస్తున్నాయి దీనితో గ్రామస్తులు వ్యాపారస్తులపై ఆక్రమిక్యం చేస్తున్నారు అధికారులు పట్టించుకోని కోళ్ల వ్యాపారులను శిక్షించాలని గ్రామస్తులు కోరుకుంటున్నారు

ఛాంపియన్స్‌ ట్రోఫీలో టీమిండియా ఫైనల్‌‌కు దూసుకెళ్లిన సంగతి తెలిసిందే

ఛాంపియన్స్‌ ట్రోఫీలో టీమిండియా ఫైనల్‌‌కు దూసుకెళ్లిన సంగతి తెలిసిందే. ఆస్ట్రేలియాతో జరిగిన తొలి సెమీ ఫైనల్‌లో టీమిండియా ఘన విజయం సాధించింది. నాలుగు వికెట్ల తేడాతో భారత జట్టు విజయాన్ని అందుకుంది. తద్వారా ఛాంపియన్స్‌ ట్రోఫీ-2025లో ఫైనల్‌కు చేరిన తొలి జట్టుగా టీమిండియా నిలిచింది.ఆస్ట్రేలియా విధించిన 265 పరుగుల లక్ష్యాన్ని భారత జట్టు సునాయాసంగా ఛేదించింది. ఛేజింగ్ మాస్టర్ కింగ్ కోహ్లీ మరోసారి రాణించడంతో ఆస్ట్రేలియాపై టీమిండియా ఘన విజయం సాధించింది. మరో వైపు రెండో ఫైనల్‌లో సౌతాఫ్రికా, న్యూజిలాండ్ జట్లు తలపడగా, కివీస్ జట్టు విజయాన్ని అందుకుని ఫైనల్‌కు చేరుకుంది. దీంతో ఆదివారం టీమిండియాతో న్యూజిలాండ్ ఫైనల్‌లో తలపడనుంది.ఇదిలా ఉంటే ఫైనల్‌కు ముందు టీమిండియాకు బిగ్ షాక్ తగిలేలా కనిపిస్తోంది. స్టార్ ఆల్‌ రౌండర్ హార్దిక్ పాండ్యాకు గాయం అయినట్టు తెలుస్తోంది. ఆస్ట్రేలియాతో జరిగిన సెమీ ఫైనల్ మ్యాచ్‌లో హార్దిక్ పాండ్యాకు గాయం అయింది. హార్దిక్ పాండ్యా బ్యాటింగ్ చేస్తోన్న సమయంలో కాలుకు గాయం అయింది. హార్దిక్ పరుగు తీయడానికి ప్రయత్నిస్తూ గాయపడ్డాడు. హార్దిక్ వెంటనే తన క్రీజులోకి తిరిగి వచ్చినప్పుడు కాలు ఇబ్బందిపెట్టినట్లు కనిపించింది.

ఏపీ కూటమి నేతలకు ప్రధాని మోదీ కీలక సందేశం

ఏపీ కూటమి నేతలకు ప్రధాని మోదీ కీలక సందేశం ఇచ్చారు. ఏపీలో జరిగిన మూడు ఎమ్మెల్సీ ఎన్నికల్లో రెండు కూటమి అభ్యర్ధులు గెలుచుకున్నారు. ఒక ఉపాధ్యాయ స్థానం నుంచి పీఆర్టీయూ అభ్యర్ధి గెలుపు పొందారు. ఉభయ గోదావరి తో పాటుగా క్రిష్ణా – గుంటూరు జిల్లాల పట్టభద్రుల నియోజకవర్గాల ఎమ్మెల్సీ అభ్యర్ధులుగా గెలిచిన కూటమి అభ్యర్ధులను ప్రధాని మోదీ అభినందిం చారు. అదే సమయంలో భవిష్యత్ నిర్దేశించారు. చంద్రబాబు స్పందించి ధన్యవాదాలు చెప్పారు. ఏపీలో జరిగిన మూడు ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూటమి రెండు స్థానాల్లో గెలుపు సాధించింది. రెండు పట్టభద్రుల నియోజకవర్గాల్లో కూటమి అభ్యర్ధులు గెలవటం పైన ప్రధాని స్పందించారు. ఏపీలో రెండు కూటమి గెలవగా.. తెలంగాణలో రెండు స్థానాలు బీజేపీ గెలుచుకుంది. ఈ రెండు తెలుగు రాష్ట్రాల్లో ఫలితాల పైన స్పందించిన ప్రధాని మోదీ తన ఎక్స్ ఖాతా ద్వారా అభినందనలు తెలిపారు…” విజయం సాధించిన ఎన్డీయే అభ్యర్థులకు అభినందనలు. కేంద్రంలోను మరియు ఆంధ్రప్రదేశ్‌లోని ఎన్‌డిఎ ప్రభుత్వాలు ప్రజలకు సేవ చేస్తూనే ఉంటాయి మరియు రాష్ట్రం యొక్క అభివృద్ధి ప్రయాణాన్ని కొత్త శిఖరాలకు తీసుకెళ్తాయి..” అని పేర్కొన్నారు.

యువత.. తన కాళ్లపై తాను నిలవాలి!

అమెరికాలో ఒకవ్యక్తికి 15 ఏళ్లు వచ్చాయంటే, తల్లి తండ్రులకు అతన్ని ఇక పెంచి పోషించాల్సిన బాధ్యతల నుండి విముక్తి లభించినట్లే. ఒకసారి కళాశాలలో అడుగు పెడితే, వారి ఖర్చులకు డబ్బు వారే సంపాదించుకోవాలి. చదువుకుంటూ, పార్ట్‌ టైమ్‌ ఉద్యోగం చేస్తూ వారి అవసరాలకు వాళ్ళే సంపాదించుకోవటం విదేశాలలో చూస్తుంటాము. కానీ మన దేశంలో ఉద్యోగం వచ్చేంత వరకు తల్లి తండ్రులే పోషించాల్సిన దుఃస్థితి ఏర్పడింది. వృద్ధులైన తల్లి తండ్రులను పోషిస్తూ, ఇటు ఎదిగి వచ్చిన పిల్లలను కూడా పోషించటం వల్ల మధ్యతరగతి వర్గం చితికి పోతున్నారన్నది వాస్తవం. అదే ఎదిగి వచ్చిన పిల్లలు తమ కాళ్ళ మీద తాము నిలబడటం నేర్చుకుంటే, కొంతైనా భారం తగ్గుతుందని గుర్తుంచుకోవాలి. ఒకప్పుడు అమెరికా వంటి దేశాలకు ఉన్నత చదువుకై వెళ్లే యువత అక్కడ చిన్న చిన్న ఉద్యాగాలు చేసుకుంటూ… తమ ఖర్చులకు తాము సంపాదించుకుంటూ చదువుకునే వాళ్ళు. అక్కడి యువతను చూసి మనవాళ్లూ అదే దారిలో నడిచేవాళ్లు. కాని, ఇప్పుడు అక్కడ కూడా తల్లితండ్రుల మీద ఆధారపడే యువత ఎక్కువ అవుతోంది. 30 ఏళ్లు వచ్చినా ఇంకా తల్లి తండ్రుల మీద ఆధారపడే యువత సంఖ్య పెరిగిపోతోంది. జంతువుల్లో కంగారూలు పిల్లల్ని చాలా కాలం మోస్తూ ఉంటాయి. అటువంటి తల్లి తండ్రులు మన దేశంలో ఎక్కువ ఆవుతున్నారు. దీనికి కొంత కారణం మన సంస్కృతిలో భాగమైన కుటుంబ వ్యవస్థ, కుటుంబ సభ్యుల మధ్య నెలకొన్న అనుబంధాలు కారణం. ఎదిగి వచ్చినా బతకలేని బిడ్డలను నెత్తి మీద మోస్తూ అప్పుల పాలవుతున్న వాళ్ళు అనేక మంది ఉన్నారు. కనీసం పెళ్ళి చేస్తేనన్నా బాధ్యతలు తెలిసివస్తాయని లక్షలకు లక్షలు ఖర్చు పెట్టి పెళ్ళిళ్ళు చేసినా వీరి ధోరణిలో మార్పు రావటం లేదు. పైపెచ్చు కొడుకుతో పాటు కోడలిని కూడా పోషించాల్సి వస్తోంది.

ఇంగ్లీషు మీడియం కొనసాగేనా?

మొత్తం దేశ చరిత్రనే మార్చే పథకం ఆంధ్రప్రదేశ్‌లోని ప్రభుత్వ పాఠశాలల్లో వైసీపీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఇంగ్లీషు విద్య. ఆ విద్యా విధానాన్ని కొత్తగా అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం కొనసాగిస్తుందా, ఆపేస్తుందా అనేది ప్రశ్న. గత ఐదేండ్లుగా ప్రభుత్వ పాఠశాల విద్యారంగంలో వచ్చిన మార్పులు గణనీయమైనవి. ఆ మార్పులను అనిష్టంగానైనా కొత్త ప్రభుత్వం కొనసాగిస్తే రానున్న ఐదేండ్లలో విద్యారంగంలోని మార్పులు పాతుకు పోతాయి. అలాకాకుండా మళ్ళీ పాత పద్ధతిలోకి విద్యావ్యవస్థను నెడితే ప్రజలు ఏం చెయ్యాలనేది చాలా కీలకమైంది. అందుకే స్కూళ్ళలో పిల్లల భవిష్యత్తును కొత్త ప్రభుత్వం వెనక్కి నెట్టకుండా చూడాల్సిన బాధ్యత వైసీపీ రాజకీయ శక్తులతో పాటు, పిల్లల తలిదండ్రుల మీద కూడా ఉంది.

టీచర్ల ‘సర్దుబాటు’పై కొత్త మార్గదర్శకాలు

అమరావతి: రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల ఉపాధ్యాయులకు ‘పని సర్దుబాటు’ బదిలీలపై ప్రభుత్వం కొత్త మార్గదర్శకాలను ఆదివారం విడుదల చేసింది. ఈ మేరకు పాఠశాల విద్యా శాఖ డైరెక్టర్‌ విజయ్‌ రామరాజు ఉత్తర్వులు జారీ చేశారు. ఉపాధ్యాయ సంఘాల అభిప్రాయాలు తీసు­కున్న తర్వాత నూతన మార్గదర్శకాలను రూపొందించినట్లు ఆ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. సర్దుబాటు ప్రక్రియను సోమవారం నుంచి ఈనెల 14వ తేదీలోగా పూర్తి చేయాలని ఆదేశించారు. ఇవీ మార్గదర్శకాలు.. » ఒకే సబ్జెక్టుకు సంబంధించి అన్ని మేనేజ్‌మెంట్‌ పాఠశాలల ఆధారంగా సబ్జెక్ట్‌ టీచర్లు (ఎస్‌ఏ), ఎస్‌జీటీలను సర్దుబాటు చేయాలి. మిగులు స్కూల్‌ అసిస్టెంట్లను ఇతర సబ్జెక్టుల ప్రకారం, వారి మెథడాలజీల మేరకు సర్దుబాటు చేయాలి » అర్హత గల మిగులు ఎస్‌జీటీలు, సంబంధిత డిగ్రీ, బీఈడీ మెథడాలజీని ప్రామాణికంగా తీసుకుని ప్రీ హైస్కూల్, హైసూ్కల్స్‌లో సర్దుబాటు చేస్తారు » ఒక స్కూల్‌లో ఒకటికంటే ఎక్కువ మంది ఎస్‌ఏ (పీడీ) లేదా పీఈటీ ఉన్నవారిని గుర్తించి అదనపు సిబ్బందిని లేని స్కూళ్లకు పంపిస్తారు » ఉన్నత పాఠశాలల్లో సబ్జెక్ట్‌ స్కూల్‌ అసిస్టెంట్‌ టీచర్లకు సర్దుబాటులో ప్రాధాన్యం ఇస్తారు » యూపీ స్కూల్స్‌లో ఎన్‌రోల్‌మెంట్‌ 98 కంటే తక్కువ ఉంటే 3 నుంచి 8 తరగతులు, 1 – 2 తర­గతులను విడివిడిగా వర్గీకరించి టీచర్లను సర్దుబాటు చేస్తారు. ప్రాథమిక పాఠశాలల్లో పాత నిబంధనల ప్రకారమే సద్దుబాటు చేస్తారు. » కొత్తగా మిగులు ఉపాధ్యాయులను గుర్తించినట్లయితే వారిని అవరోహణ క్రమంలో ఏకోపాధ్యాయ పాఠశాలల్లో సర్దుబాటు చేస్తారు » ఎస్‌ఏ (పీడీ), పీఈటీలను ఈ సేవలు లేని స్కూళ్లకు పంపిస్తారు రెండు దశల్లో సర్దుబాటు కొత్త నిబంధనల ప్రకారం రెండు దశల్లో ఉపాధ్యాయుల సర్దుబాటు ఉంటుంది. మొదటి దశలో మండలంలోని ఒకే మేనేజ్‌మెంట్‌ కింద ఉన్న స్కూళ్లకు, ఇంటర్‌ సబ్జెక్టుకు సంబంధించి అదే మండలానికి, మండల పరిధిలోని అర్హత కలిగిన అదే మండల పరిధిలోని స్కూళ్లలో సర్దుబాటు చేస్తారు.

నకిలీ వార్తలు గుర్తించేందుకు ఏఐ సాయం

టెక్నాలజీ పెరుగుతున్న కొద్దీ చాలా మాధ్యమాల్లో వస్తున్న సమాచారం ఏమేరకు ప్రామాణికమైందో ప్రశ్నార్థకంగా మారింది. సరైన సమాచారం ఇవ్వకపోయినా ఫర్వాలేదు..కానీ తప్పుడు సమాచారంతో మరింత ప్రమాదం చేకూరుతుంది. విద్యార్థి దశలోనే దానిపై సరైన అవగాహన పెంపొందించుకుంటే మేలని కేరళ ప్రభుత్వం కొత్త విధానాన్ని తీసుకొచ్చింది. విద్యార్థుల సాధికారత కోసం కేరళ జనరల్‌ ఎడ్యుకేషన్‌ విభాగం ఐదు, ఏడో తరగతుల్లోని ఐసీటీ పాఠ్యపుస్తకాల్లో ‘ఫ్యాక్ట్‌ చెకింగ్‌’ మాడ్యూళ్లను ప్రవేశపెట్టినట్లు ప్రకటించింది. ఇది నకిలీ వార్తలను గుర్తించడంలో ఉపయోగపడుతుందని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. ఆన్‌లైన్ ప్లాట్‌ఫామ్‌ల్లో నిజాలను నిర్ధారించుకోవడానికి ఎంతో సహాయపడుతుందని చెప్పాయి.

 Share

 నోటిఫికేషన్స్